News April 11, 2025
రావులపాలెంలో కిడ్నాప్ కలకలం.. కారణమిదే

ఓ లోడు విషయంలో రూ.15లక్షలు బాకీ వల్ల రావులపాలెనికి చెందిన రమేశ్ తండ్రి సుబ్బారావును కిడ్నాప్ చేశారు. రమేశ్ 4ఏళ్లుగా మహరాష్ట్రలోని సాంగ్లీకి చెందిన సంజుతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. సుబ్బారావు ద్రాక్ష తోటల కోనుగోలు కోసం తరచూ మహరాష్ట్ర వెళ్లేవాడు. రమేశ్, సంజు మధ్య వివాదం జరగడంతో సంజు మనుషులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. రమేశ్ ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేశామని ASI రమణారెడ్డి తెలిపారు.
Similar News
News January 11, 2026
పెద్దాపురప్పాడులో వ్యక్తి మృతి.. సిగరెట్ నిప్పు ప్రాణం తీసిందా?

పెద్దాపురప్పాడులో శనివారం ఓ వ్యక్తి కాలిన గాయాలతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినయ కుమార్ (44) శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మరణించారు. సిగరెట్ తాగుతున్న సమయంలో మంటలు అంటుకుని ఉంటాయని మృతుడి కుమార్తె పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 11, 2026
పోలవరం స్పిల్‌వేకు ద్రవిడియన్ తోరణాలు!

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్‌వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
News January 11, 2026
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.


