News February 11, 2025

రావులపాలెం జొన్నాడ బ్రిడ్జి కింద మహిళ మృతదేహం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బ్రిడ్జి కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రావులపాలెం ఎస్సై చంటి తెలిపారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మహిళ 5,4 పొడవు, నీలి రంగు చీరతో ఉందన్నారు.

Similar News

News February 11, 2025

గాజువాకలో గంజాయి స్వాధీనం

image

కణితి రోడ్డులోని ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో గాజువాక పోలీసులు మంగళవారం తనిఖీలు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ తనిఖీలలో 184 కేజీల గంజాయి, ఒక కారు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇమ్రాన్ ఖాన్, అర్జున్ కుమార్, కోరాడ బాలాజీ కృష్ణ, బిదేశి కుమార్ సాహు, దామా ఖరా, శుక్రమతం, రామచంద్ర సిషా, మనోజ్ ఖేముండు ఉన్నట్లు తెలిపారు.

News February 11, 2025

ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

image

జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.

News February 11, 2025

మెదక్ జిల్లాలో రూ.84,40,52,317 జమ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. గత రెండు రోజుల కింద ఎకరంలోపు సాగు చేసుకునే రైతులకు వారి అకౌంట్లో జమ చేసింది. సోమవారం రెండు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు విడుదల చేయగా మెదక్ జిల్లాలోని మొత్తం 1,72,349 మంది రైతులకు రూ.84,40,52,317 జమ చేశారు. దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!