News February 1, 2025
రావులపాలెం ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి- కలెక్టర్

రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జాతీయ రహదారుల ఇంజీనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో భూసేకరణ అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఈ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు.
Similar News
News January 2, 2026
‘గ్రోక్’ అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్

Xలో ‘గ్రోక్’ అశ్లీల ట్రెండింగ్‌పై కేంద్రం సీరియస్ అయింది. అలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలంటూ సదరు సంస్థను ఆదేశించింది. ఇటీవల గ్రోక్ సాయంతో మహిళల ఫొటోలను బికినీలోకి మారుస్తున్న ట్రెండ్‌పై సర్వత్రా <<18744158>>ఆందోళన<<>> వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం అసభ్యకర, నగ్న, లైంగిక చర్యలను ప్రోత్సహించే కంటెంట్‌ను తొలగించాలని Xకు లేఖ రాసింది. AIని ఇలా దుర్వినియోగపర్చడం సరికాదని సూచించింది.
News January 2, 2026
HYD: ‘మీ సోకు మేం క్యాష్ చేస్కుంటాం’

ధరల పెంపుతో స్మోకర్స్‌కు ముందే ‘పొగ’ పెడుతున్నారు వ్యాపారులు. సిగరెట్లపై 40% పన్ను పెంచుతున్నట్లు కేంద్రం చెప్పడమే లేట్ నగరంలో నోస్టాక్ అంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్యాకెట్‌పై ₹10 సింగిల్‌గా ₹2 ఎక్స్‌ట్రా గుంజుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే వ్యాపారుల దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే ఎవరిని ప్రశ్నించాలని వాపోతున్నారు. వాస్తవంగా పెరిగిన ధరలు FEB-1 నుంచి అమల్లోకి రావాలి.
News January 2, 2026
ఐఐటీ, నీట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

ఐఐటీ, నీట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన శ్రీచైతన్య HNK (స్నేహానగర్) పూర్వ విద్యార్థులను మంగళవారం సన్మానించారు. ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందిన సాయి రిషాంత్ (6వ ర్యాంకు), రష్మిత (7వ ర్యాంకు)లకు రూ.5 లక్షల చొప్పున, ఎయిమ్స్ ఢిల్లీలో సీటు సాధించిన షణ్ముక్ (11వ ర్యాంకు)తో పాటు త్రిశూల్, నితిన్ రెడ్డికి రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు అందజేశారు. ఛైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ACP ప్రశాంత్ పాల్గొన్నారు.


