News March 30, 2025
రావులపాలెం వాసికి ఉగాది పురస్కారం

రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఉగాది పురస్కారానికి రావులపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ టీటీడీ వేద పండితుడు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని ఎంపికయ్యారు. అవధానం విభాగంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆయనను ఎంపిక చేసినట్టు అధికారుల నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఆదివారం విజయవాడలో జరిగే శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు వెళ్తున్నట్టు అవధాని తెలిపారు.
Similar News
News November 15, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. సత్య నాదెళ్లకు ఆహ్వానం?

డిసెంబర్ 8, 9న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. వచ్చేనెల నాదెళ్ల INDలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన టూర్ షెడ్యూల్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నాదెళ్ల రాకపై క్లారిటీ రానుంది.
News November 15, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు ‘ఇటుక’ గుదిబండ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇటుక ధరలు పెనుభారంగా మారాయి. ఇటుక బట్టీల తయారీదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచారు. 2500 ఇటుకల ధర గతంలో రూ.10,000 కాగా ప్రస్తుతం రూ.18,000 వరకు పెంచారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడిపై అదనంగా లక్ష రూపాయల వరకు భారం పడుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, రాయితీపై ఇటుకలు సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
News November 15, 2025
దివ్యాంగుల రిజర్వుడ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

AP: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని దివ్యాంగుల రిజర్వుడ్ ఖాళీలను ప్రత్యేక రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ బ్యాక్‌లాగ్ కేటగిరీ పోస్టులను 2026 మార్చి 31లోగా భర్తీ చేయాలని సూచించింది. ఈమేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 2024 మార్చి 31లోగా పోస్టుల భర్తీకి గడువు నిర్దేశించగా తాజాగా దాన్ని పొడిగించింది.


