News January 30, 2026

రావులపాలెం: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి.. గ్రూప్-2 జాబ్ సాధించి..

image

రావులపాలెంకు చెందిన కాదులూరు సత్యశ్రీ ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లో విజయం సాధించి అధికారిగా ఎంపికయ్యారు. టీవీ మెకానిక్ సత్యనారాయణ, గృహిణి అన్నపూర్ణ దంపతుల కుమార్తె అయిన సత్యశ్రీ కఠిన పరిస్థితుల్లో చదువుకుని ఈ ఘనత సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్‌కు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2 సాధించారు.

Similar News

News February 8, 2026

తలకు నూనె ఎప్పుడు రాయాలంటే?

image

తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట/ రెండు గంటల ముందు నూనె రాయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారానికి రెండుసార్లు నూనె రాస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. రాత్రిళ్లు నూనె రాయకూడదని చెబుతున్నారు.

News February 8, 2026

తల్లీ బిడ్డలు మృతి.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్

image

పుత్తూరులో పద్మ ఇద్దరు పిల్లలతో <<19079819>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన తెలిసిందే. ‘సంపాదన లేని భర్తతో వేగలేక, కుటుంబాన్ని నెట్టుకురాలేక నేను ఇబ్బందులు పడ్డా. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం. భార్యా పిల్లలను పోషించలేని వాడు పెళ్లెందుకు చేసుకోవాలి. మేము చనిపోతున్నాం. ఇక నువ్వు హ్యాపీగా ఉండు. అన్న నన్ను క్షమించి. 8ఏళ్లు అవుతుంది నీతో మాట్లాడి’అని ఆమె సూసైడ్ లేఖ రాసింది.

News February 8, 2026

అల్లూరి: ఆశా కార్యకర్తల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలోని ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను శనివారం నుంచి ఫిబ్రవరి 20వ తేదీ లోగా సంబంధిత ఆస్పత్రి వైద్యునికి స్వయంగా అందజేయాలని సూచించారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.