News January 10, 2026

రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా పెద్దకడబూరు పీఎస్

image

పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.

Similar News

News February 11, 2026

HYD: మారిన రూపురేఖలు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే!

image

నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీకి నేడు 300 డివిజన్లతో భారీ విస్తరణ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు సీఎంగా వైఎస్ఆర్ నేడు రేవంత్ రెడ్డి హయాంలో మార్పులు జరిగాయి. ఈ 12 ఏళ్ల కాలంలో మహానగరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో రైలు, బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు.. ఇలా అనేకం నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయి.

KNR: ఒక్క ఓటు.. తలరాతను మార్చే ఓటు

image

పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన సర్పంచులు ఉన్నారు. PDPL(M) రంగాపూర్‌కు చెందిన గంట రమేష్, KNR(D) తిమ్మాపూర్(M) కొత్తపల్లికి చెందిన శోభారాణి ఒక్క ఓటుతేడాతో గెలుపొందారు. ఇప్పుడు మున్సిపల్ పోరులోనూ అదే ‘ఒక్క ఓటు’ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనుంది. ఆ నిర్ణయాత్మక శక్తి మీదే కావచ్చు! ఓటు వేయడం మన బాధ్యత మాత్రమే కాదు, రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. వెంటనే పోలింగ్ కేంద్రం వైపు అడుగులేయండి.