News March 20, 2025
రాష్ట్రంలోనే జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. ఈ ఘనత మున్సిపల్ ప్రజలు, సిబ్బంది వల్లే సాధ్యమైందని ఇరువురు తెలిపారు.
Similar News
News March 22, 2025
అనకాపల్లి జిల్లాలో వడగాల్పులు

జిల్లాలో పలు చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని APSDMA తెలిపింది. జిల్లాలో శుక్రవారం నాతవరంలో 40.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దెబ్బకు వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని తెలిపింది. అటు వైద్య శాఖ సైతం పలు సూచనలు చేసింది.
News March 22, 2025
PPM: అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

పార్వతీపురం జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 17 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా. టి కనకదుర్గ శుక్రవారం తెలిపారు. పార్వతీపురం, సాలూరు, బలిజీపేట, సీతానగరం, పాలకొండ, వీరఘట్టం, భామిని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్నా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
News March 22, 2025
MBNR: పాలమూరులో ఇక క్రికెట్ పండుగ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయ స్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోర్నీలో ఒక్కో రాష్ట్రం నుంచి 16 మంది క్రీడాకారులు, ఒక కోచ్, ఒక మేనేజర్ పాల్గొననున్నారు. దీంతో పాలమూరులో నూతన ఉత్సాహం నెలకొననుంది.