News March 7, 2025
రాష్ట్రంలోనే టాప్ నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. గురువారం జిల్లాలోని మంచిప్పలో 40.8℃, తూంపల్లిలో 40.7℃ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలు రాష్ట్రంలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Similar News
News March 9, 2025
ఎడపల్లి: బావిలో దూకి యువకుడు ఆత్మహత్య

ఎడపల్లి మండలంలోని ఠాణాకలన్ గ్రామానికి చెందిన సురేశ్(24) అనే యువకుడు కుటుంబ కలహాలతో శుక్రవారం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మృతదేహం నీటిపై తేలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 9, 2025
NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదుతో పాటు, చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News March 9, 2025
NZB: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: ACP

నిర్మల్‌లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన షేక్ ఇమ్రాన్, నాందేడ్‌కు చెందిన అమన్, బాసరకు చెందిన షేక్ అర్బాజ్ ముగ్గురు కలిసి NZBలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వారిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా అమన్ పరారీలో ఉన్నట్లు ACP వెల్లడించారు.