News December 30, 2025

రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా తిరుపతి

image

జిల్లాల పునర్విభజన తర్వాత జనాభా పరంగా తిరుపతి అతిపెద్ద జిల్లాగా అవతరించింది. గతంలో 4 డివిజన్లు, 34 మండలాలు, 29, 04,254 మంది జనాభాతో జిల్లా ఉండేది. తాజా మార్పులతో జిల్లాలో 3 డివిజన్లు, 36 మండలాలు ఉన్నాయి. జనాభా 29,47,547కు పెరిగింది. మండలాల పరంగా కడప(40) టాప్‌లో ఉండగా తిరుపతి జిల్లా 2వ స్థానంలో ఉంది. రైల్వేకోడూరులోని మంగంపేట ముగ్గురాయి గనులు తిరుపతిలోకి రావడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

Similar News

News February 18, 2026

జిల్లాలోనే ‘టాప్’లో జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్..!

image

అంకితభావంతో సేవలు అందిస్తూ కూసుమంచి మండలం జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ అరుదైన రికార్డు సృష్టించింది. సేవలందించడంలో జక్కేపల్లి పోస్ట్ ఆఫీస్ జిల్లాలో ప్రథమ, రాష్ట్రంలో టాప్-10 స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. గ్రామస్తుల్లో పొదుపు అలవాటు ఎక్కువగా ఉండటం వల్లే ఈ పోస్ట్ ఆఫీస్ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.

News February 18, 2026

లక్కిరెడ్డిపల్లి గంగమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ

image

లక్కిరెడ్డిపల్లి మండలం గంగమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను ఆలయానికి తీసుకెళ్లి సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు మండిపల్లి తెలిపారు.

News February 18, 2026

GHMCలో రోజుకు 7,800 టన్నుల చెత్త సేకరణ

image

GHMC పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై కమిషనర్ కర్ణన్ సమీక్షించారు. రోజూ నగరంలోనే దాదాపు 7,800 టన్నుల చెత్తను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాయి. అదే సమయంలో 2,650 స్వయం సహాయక సంఘాలకు చెందిన 18,557 మంది కార్మికులు క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేస్తున్నారని కమిషనర్ వివరించారు.