News March 30, 2025
రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఆళ్లగడ్డ

నంద్యాల జిల్లాలో కొద్దిరోజులుగా భానుడు భగభగ మండుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం.. ఆదివారం 41.5°C ఉష్ణోగ్రతతో ఆళ్లగడ్డ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 1, 2025
మా ప్రభుత్వం రూ.వేల కోట్ల భూమిని కాపాడింది: భట్టి

TG: కంచ గచ్చిబౌలిలోని ₹వేల కోట్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తాము కాపాడామని Dy.CM భట్టి తెలిపారు. ‘400 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం 2004లో IMG భారత్‌కు కేటాయిస్తే, 2006లో YSR ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో IMG భారత్ కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి కేసు కోర్టులోనే ఉంది. పదేళ్లుగా BRS కూడా పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని చూసింది’ అని ఆరోపించారు.
News April 1, 2025
VZM: 10వ తరగతి పరీక్షకు 133 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో మాణిక్యాలరావు తెలిపారు. సోషల్ పరీక్షకు 133 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సోషల్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22,862 మంది హాజరు కావాల్సి ఉండగా 22,774 మంది హాజరయ్యారన్నారు. రెగ్యులర్ 88 మంది విద్యార్థులు గైర్హాజరుకాగా, ప్రైవేటు విద్యార్థులు 116మందికి గాను 45 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
News April 1, 2025
బుక్కపట్నం: డైట్ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తూ.. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ కలిగిన స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 10 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.