News September 24, 2025
రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం: జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ అరాచక పాలన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. లాఠీచార్జి బాధితుడు సాయి సిద్ధూను అతని స్వగ్రామమైన దామరచర్ల మండలం కొత్తపేటతండాలో ఎంఎల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భూపాల్ రెడ్డి, భగత్‌తో కలిసి పరామర్శించారు.
Similar News
News September 25, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 25, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.22 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 25, 2025
బెల్లంపల్లి: 316 మంది కార్మికులు రెగ్యూలరైజ్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన 258 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్ ఏరియాలో 241, మందమర్రి ఏరియాలో 64, బెల్లంపల్లి ఏరియాలో 11 మంది ఉద్యోగులు రెగ్యూలరైజ్ అయ్యారు. భూగర్భ గనుల్లో 190, ఓసీలు, సర్ఫేస్‌లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారు అర్హులు
News September 25, 2025
హైడ్రాకు భారీగా నిధుల విడుదల

TG: విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం రూ.69 కోట్ల నిధులు విడుదల చేసింది. అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు నిధులు రిలీజ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం GHMC నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద రూ.20 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో హైడ్రా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.