News February 3, 2026

రాష్ట్రంలో ఆటవిక దాడులు కొనసాగుతున్నాయి: సీదిరి

image

రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట ఆటవిక దాడులు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైయస్సార్సీపీ శ్రేణులతో కలిసి సోమవారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటి పైనా జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు.

Similar News

News February 13, 2026

రేపు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO రవిబాబు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని తెలిపారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.

News February 13, 2026

శ్రీకాకుళం: నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

image

ఆకాశవాణి.. అంటూ గగనతలం నుంచి సాగిన అదృశ్యవాణి ఒక తరానికి తీరని జ్ఞాపకం. టీవీలు, సెల్ ఫోన్లు రాకముందు రేడియో ఒక అద్భుతమైన స్నేహితుడు. పాటలు, కథలు, న్యూస్, వినోదం ఇలా ఎన్నో రకాల సేవలు అందించే ఈ రేడియో నేటి తరానికి తెలియదు. సమాచార విప్లవం తర్వాత కూడా ఎఫ్.ఎమ్ అంటూ సందడి చేసింది. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం.

News February 13, 2026

మందస: రాజవంశీయుడు కన్నుమూత

image

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.