News January 20, 2026
రాష్ట్రంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరితేదీ

TGSRTCలో 198 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేస్తోంది. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు www.tgprb.inలో అందుబాటులో ఉంటాయి.
Similar News
News February 21, 2026
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.
News February 21, 2026
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
News February 21, 2026
667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


