News September 12, 2025
రాష్ట్రంలో ఎరువులకు కొరతలేదు: మంత్రి

రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుపుతున్నామన్నారు.
Similar News
News September 12, 2025
అమరావతి ORR అప్డేట్

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.
News September 12, 2025
కడెం వరద గేట్లు ఎత్తే అవకాశం

కడెం పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున శుక్రవారం రాత్రి కడెం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి నీళ్లను వదిలే అవకాశం కడెం ప్రాజెక్టు నాల్గవ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలన్నారు. పశువుల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
News September 12, 2025
GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.