News December 24, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయి: MLC కవిత

image

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ నడిపిస్తున్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు.

Similar News

News December 23, 2024

NZB: ‘చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి’

image

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విషాహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.30,000 బాకీ పడ్డారని వాటిని కూడా చెల్లించాలన్నారు.

News December 23, 2024

నిజామాబాద్ కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు

image

తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

News December 23, 2024

NZB: పదవులు శాశ్వతం కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్: KA పాల్

image

తన మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారని, ముఖ్యమంత్రి తనను వాడుకొని వదిలేశారని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్’ అని అన్నారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలవి పచ్చి అబద్ధాలు అని విమర్శించారు.