News February 28, 2026

రాష్ట్రంలో ఖమ్మం ఫస్ట్.. 30వ స్థానంలో భద్రాద్రి

image

ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా, వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోదై రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. పీఎం కిసాన్ సహా కేంద్ర పథకాల లబ్ధికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు సూచించారు.

Similar News

News March 2, 2026

మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US

image

ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ అన్నారు. ఇరాన్‌పై జరిగిన ఏరియల్ ఆపరేషన్ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కచ్చితమైనదని పేర్కొన్నారు. ‘ఇరాన్ వంటి ప్రభుత్వాలు అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అమెరికన్లను చంపే/బెదిరించే ఎవరినైనా వేటాడుతాం. ఇది అంతులేని యుద్ధంగా మారదు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News March 2, 2026

సంగారెడ్డి: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డిలోని డీకేర్ సెంటర్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాన్ని సందర్శించే వృద్ధులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.

News March 2, 2026

పాకిస్థాన్‌పై విరాట్ అద్భుతం చేశారు: రోహిత్

image

2022 T20WCలో పాకిస్థాన్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘160 పరుగుల టార్గెట్ ఛేదనలో 31కే 4 వికెట్లు పడిపోయాయి. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉండిపోయా. అప్పుడు కోహ్లీ అద్భుతం చేశారు. అసలు మేం గెలిచే స్థితిలోనే లేము. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్‌లో కోహ్లీ దాన్ని సుసాధ్యం చేశారు. నేను ఆడిన క్రికెట్ మ్యాచుల్లో అదొక గొప్ప ఆట’ అని ICC ఇంటర్వ్యూలో చెప్పారు.