News November 6, 2024
రాష్ట్రంలో చంద్రన్న దోపిడీ పథకాలు: విజయసాయి రెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న దోపిడి పథకాలను అమలు చేస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. చంద్రన్న ఇసుక దోపిడి పథకం, చంద్రన్న మద్యం దోపిడి, చంద్రన్న విద్యుత్ దోపిడి, చంద్రన్న పింఛన్ల కోత పథకం, చంద్రన్న దీపం అర్హుల కోత పథకం, చంద్రన్న డూపర్ సిక్స్ పథకం, చంద్రన్న ఖనిజ దోపిడీ పథకాలను అమలు చేస్తుందని ధ్వజమెత్తారు.
Similar News
News September 17, 2025
విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.
News September 17, 2025
జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.
News September 17, 2025
విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.