News September 2, 2025

రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం: కలెక్టర్

image

జిల్లాలో భూగర్భ జలాల స్థాయిలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్‌ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో భూగర్భ జలాల స్థాయిలపై చర్చించారు. జిల్లాలో 3 మీటర్ల లోపల 17 మండలాల్లో, 3 నుంచి 8 మీటర్ల లోపల 9 మండలాల్లో, 8 మీటర్ల లోతులో 2 మండలాల్లో భూ గర్భ జలాల స్థాయిలు ఉన్నాయని, రాష్ట్రంలో బాపట్ల సరాసరి 3.7 మీటర్ల లోతులో ఉంటూ మొదటి స్థానంలో ఉందన్నారు. విజయనగరం 2వ స్థానంలో ఉందని వెల్లడించారు.

Similar News

News September 2, 2025

VZM: ‘పెండింగ్ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయండి’

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో NDPS చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. పెండింగులో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పరారీలో ఉన్న నిందితుల సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని సూచించారు.

News September 2, 2025

సమస్యను తీర్చడం సేవగా భావించాలి: కలెక్టర్

image

అర్జీదారులు తమ సమస్యలు, బాధలు తీరుతాయనే పీజీఆర్ఎస్‌కు వస్తారని, వాటిని అర్ధం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన సేవ అని కలెక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో ఆర్జీల పరిష్కారం పై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్జీల పరిష్కారం చేయడం ద్వారా ఒకరి సమస్య తీర్చడమే నిజమైన సేవగా భావించాలన్నారు.

News September 2, 2025

జిల్లాలో 24 మందికి కిసాన్ డ్రోన్లు: మంత్రి

image

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్‌ను జామి మండలం మొక్కాసవలస గ్రామానికి చెందిన లబ్ధిదారుడు కూనిరెడ్డి సత్యనారాయణ మూర్తికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద జిల్లాలో 24 డ్రోన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.