News August 3, 2024
రాష్ట్రంలో టాప్ ప్లేస్‌లో ఎన్టీఆర్ జిల్లా

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లు 1,603 ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో తెలిపారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 207 ఉన్నాయన్నారు. ఏపీలో గుర్తించిన అన్ని బ్లాక్ స్పాట్లలో స్వల్పకాలిక మరమ్మతులను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పారు. కాగా కృష్ణా జిల్లాలో 148 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News April 7, 2026
కృష్ణా: పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.
News April 6, 2026
కృష్ణా: తమీమ్ అన్సారియాను కలిసిన ఎస్జీఎఫ్ఐ

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను సోమవారం ఎస్జీఎఫ్ఐ ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి భానుమూర్తి రాజుతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కార్యదర్శులు రాంబాబు, శిరీషలు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో పాఠశాల స్థాయి క్రీడల అభివృద్ధికి, పోటీల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని వారు కమిషనర్‌ను కోరారు.
News April 3, 2026
చల్లపల్లి: అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అభినందనీయం

అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహాయం అభినందనీయం అని డీఆర్ఓ సీసీ వెంకటేశ్వరరావు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో ఇటీవల అగ్నిప్రమాదంలో కర్రా లక్ష్మయ్య పూరిల్లు కాలిపోయింది. వారికి శుక్రవారం రెడ్ క్రాస్ చల్లపల్లి ఛైర్మన్ లీలాబ్రహ్మేంద్ర స్టీల్ సామాన్లు, నిత్యావసర సరుకులు, టార్పాలిన్, రగ్గు, జిల్లా ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ ద్వారా రూ.5వేలు ఆర్థిక సహాయం అందచేశారు.


