News June 22, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీమంత్రి అమర్నాథ్

image

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో టీడీపీ దమనకాండను సాగిస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన టీడీపీ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోందని దుయ్యబట్టారు.

Similar News

News January 29, 2026

విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువల సవరణ

image

రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువలను సవరించింది. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ప్లాట్లకు ప్రతి చదరపు అడుగుకు రూ.100 పెంపు ప్రతిపాదించింది. ప్రస్తుతం చదరపు అడుగు రూ.4,200గా ఉండగా, కొత్తగా రూ.4,300గా నిర్ణయించారు. అయితే కమర్షియల్ ఆస్తుల విషయంలో చదరపు అడుగుకు రూ.100 తగ్గించారు. నిర్మాణాల కాంపోజిట్ రేట్లను కూడా పెంచనున్నారు. ఈ సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News January 29, 2026

విశాఖలో ముగిసిన జాతీయ జైళ్ల అధికారుల సదస్సు

image

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన 9వ జాతీయ కారాగార నిర్వాహకుల సదస్సు గురువారం ముగిసింది. ముగింపు వేడుకలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని, సంస్కరణ నిలయాలుగా మారాలని ఆమె ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగం, లేబర్ కోడ్ మార్పులు, ఖైదీల పునరావాసంపై సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

News January 29, 2026

విశాఖ: 481 మంది అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం

image

విశాఖలో అర్హులైన జ‌ర్న‌లిస్టులు 481మందికి తొలి విడ‌త‌లో అక్రిడిటేష‌న్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ ఆమోదం తెలిపింది. క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త‌న‌ క‌లెక్ట‌రేట్లో గురువారం స‌మావేశం జ‌రిగింది. జ‌ర్న‌లిస్టుల అర్హ‌త‌లు, అంశాల‌పై చ‌ర్చించారు. 512 మందికి ప్ర‌తిపాదించ‌గా 481కి కమిటీ ఆమోదం ల‌భించింది. ప్రింట్ 287, ఎల‌క్ట్రానిక్ మీడియా 194 ద‌ర‌ఖాస్తులు అర్హ‌త పొందాయి