News August 13, 2025
రాష్ట్రంలో వరంగల్ -1 డిపోకు అగ్రస్థానం

రాష్ట్రంలోనే ఆర్టీసీ వరంగల్-1 డిపో అగ్రస్థానంలో నిలిచింది. రాఖీ పండుగ రోజు రాష్ట్రంలోని 97 డిపోల్లో వరంగల్-1 డిపో రూ.49.14 లక్షల ఆదాయాన్ని రాబట్టినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బస్సులు 79,057 కి.మీలు తిరిగాయన్నారు. మహాలక్ష్మి పథకంతో పాటు మామూలు ప్రయాణికులతో ఈ ఆదాయాన్ని రాబట్టినట్లు వెల్లడించారు.
Similar News
News August 30, 2025
ఐనపల్లిలోని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

ఖానాపూర్ మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద శనివారం రాత్రి సందర్శించారు. గురుకులంలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు, తదితర రిజిస్టర్లను, భోజనాన్ని, గదులను పరిశీలించారు. అందుతున్న బోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారితో కలిసి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులున్నారు.
News August 30, 2025
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి: వరంగల్ కలెక్టర్

జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో విడుదల చేసిన 3,83,736 డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు తెలపాలని పార్టీల ప్రతినిధులను కలెక్టర్ డా.సత్య శారద కోరారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆమె, జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోపు తెలియజేయాలని కోరారు. ఈ నెల 31 లోపు అభ్యంతరాలు పరిష్కరించి, సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
News August 29, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.