News January 7, 2026

రాష్ట్రంలో 1095 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

AP: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1095 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల మహిళలు JAN 20 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, BCom, BSc, BEd, MA, ఇంటర్+ ANM ఉత్తీర్ణులు అర్హులు. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: vizianagaram.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

Similar News

News February 12, 2026

పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ

image

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పేషీలో కలిశారు. నియోజకవర్గ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

News February 12, 2026

రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.

News February 12, 2026

కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం?

image

AP: ఎంపీ కేశినేని చిన్నీపై ఆరోపణలు, ప్రభుత్వంపై పరోక్ష విమర్శలతో తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు నిత్యం <<19095636>>వివాదాల్లో<<>> ఉంటున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. క్రమశిక్షణ దాటితే ఉరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి కోరినట్లు తెలుస్తోంది.