News January 18, 2026

రాష్ట్రంలో 1095 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1095 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు (JAN 20) తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ITI, B.Ed, MA ఎడ్యుకేషన్, MPHW, ANM ఉత్తీర్ణులు అర్హులు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా మహిళా అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సైట్: https://vizianagaram.ap.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

Similar News

News February 20, 2026

ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

image

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8

News February 20, 2026

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

News February 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.