News December 21, 2025

రాష్ట్రంలో 182 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

APలోని 26 జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో 182 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని చేస్తున్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 35-65ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: wdcw.ap.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

Similar News

News December 22, 2025

టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

image

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్‌కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.

News December 22, 2025

పాస్టర్లకు గౌరవ వేతనం మేమే ప్రారంభించాం: చంద్రబాబు

image

AP: కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరి కోసం పనిచేస్తుందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం తామే ప్రారంభించామని చెప్పారు. ఈ నెల 24న రూ.50కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రైస్తవ సంస్థలు విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయని, NTR కూడా మిషనరీ స్కూల్‌లోనే చదువుకున్నారని CM గుర్తుచేశారు.

News December 22, 2025

హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన LIC

image

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. <<18548745>>RBI రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో ఆ మేర తాము కూడా రుణ రేట్లను సవరించినట్లు వెల్లడించింది. కొత్తగా హోం లోన్ తీసుకునేవారికి వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.