News March 20, 2025

రాష్ట్రంలో 26 సైబర్ పోలీస్ స్టేషన్లు: హోం మంత్రి

image

రాష్ట్రంలో కొత్తగా 26 సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధం చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో కనీసం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 277 మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పించాల్సి ఉందన్నారు.

Similar News

News March 21, 2025

ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.

News March 21, 2025

నల్లబెల్లి: తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమారుడు

image

తల్లిదండ్రుల కలను ఓ కుమారుడు నెరవేర్చాడు. నల్లబెల్లి మండల పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలి, పద్మ దంపతుల కుమారుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2023 టీఎస్పీఎస్పీ సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో భద్రాద్రి జోన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు.

News March 21, 2025

అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.

error: Content is protected !!