News January 8, 2026

రాష్ట్రంలో 424 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

Similar News

News February 13, 2026

మున్సిపల్ ఫలితాలు.. ఇప్పటి వరకు..

image

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు 65 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపు జెండా ఎగరేసింది. BRS 14 చోట్ల గెలుపొందగా, BJP ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 34 చోట్ల హంగ్ ఏర్పడింది. వార్డుల్లో కాంగ్రెస్ 1,310, BRS 707, BJP 249చోట్ల గెలుపొందాయి. అటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

News February 13, 2026

ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. ఇది మర్చిపోవద్దు!

image

భారతీయ రైల్వే 45 పైసలకే ₹10 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తోందని తెలుసా? ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ సర్వీసును అందిస్తోంది. ప్రమాదంలో మరణించినా/శాశ్వత వైకల్యం ఏర్పడినా ₹10 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹7.5 లక్షలు, గాయపడితే ₹2 లక్షలు అందిస్తుంది. మృతదేహం తరలింపుకు ₹10 వేలు ఇస్తుంది. బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ కోసం నామినీ వివరాలు ఎంటర్ చేయడం మర్చిపోవద్దు.

News February 13, 2026

తమలపాకులతో ఇలా చేస్తే..

image

‘నాగవల్లి దళాలు’ అని పిలిచే తమలపాకులు అతి పవిత్రమైనవి. ఈ ఆకులో లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతలు ఉంటారని పురాణాల వాక్కు. అందుకే శుభకార్యాల్లో తాంబూలం సమర్పిస్తారు. ఇది సంపూర్ణతకు నిదర్శనం. సీతాదేవి ఆశీస్సుల వల్ల హనుమాన్‌కి ఇవంటే చాలా ప్రీతి. ఆయనను వీటితో పూజిస్తే శని దోషాలు పోతాయని నమ్మకం. అలాగే వీటికి ఔషధ గుణాలెన్నో! జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. పూజలో తాజాగా, తొడిమ ఉన్న ఆకులను వాడటం ఉత్తమం.