News January 16, 2026
రాష్ట్రంలో 424 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 18) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+అలవెన్సులు రూ.4వేలు చెల్లిస్తారు. సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News February 14, 2026
శివరాత్రి: పూజలో వాడకూడని వస్తువులివే!

శివపూజలో కొన్ని వస్తువులు నిషిద్ధం. బ్రహ్మదేవుని అబద్ధానికి సహకరించినందుకు మొగలి పువ్వు, జలంధర సంహార కారణంగా తులసి దళాలు శివ పూజకు వాడరు. శివుడు వైరాగ్యమూర్తి కావడంతో సౌభాగ్య చిహ్నాలైన పసుపు, కుంకుమలు లింగంపై నిషిద్ధం. అయితే పానవట్టంపై వాడొచ్చు. అలాగే కొబ్బరికాయ సమర్పించినా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయరాదు. వీటికి బదులుగా విభూతి, బిల్వదళాలు, పాలు, గంగాజలంతో పూజించాలి. తద్వారా సకల శుభాలు కలుగుతాయి.
News February 14, 2026
పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలడానికి కారణాలు

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.
News February 14, 2026
DMHO చిత్తూరులో ఉద్యోగాలు

AP: నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా DMHO చిత్తూరు 7 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(CS), BE, డిగ్రీ, డిప్లొమా, మెడికల్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా(మైక్రోబయాలజీ, వైరాలజీ, పాథాలజీ, ల్యాబ్ సైన్స్), BSc(MLT), ఇంటర్ వొకేషనల్ కోర్సు అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in


