News December 22, 2025

రాష్ట్రంలో 66 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>తెలంగాణలో<<>> 66 సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు DEC 29వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్(CBT) FEBలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1250, EWS, PwBD, SC, STలకు రూ.600. వెబ్‌సైట్: tshc.gov.in

Similar News

News December 22, 2025

కొత్త పరిశోధన.. డిటర్జెంట్‌తో దోమకాటుకు చెక్!

image

తాము తయారు చేసిన డిటర్జెంట్‌తో దోమ కాటుకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు IIT ఢిల్లీ పరిశోధకులు. ట్రయల్స్ సక్సెసవడంతో పేటెంట్‌కు అప్లై చేశారు. పౌడర్, లిక్విడ్ ఫామ్‌లో ఉండే ఈ డిటర్జెంట్‌తో దుస్తులు వాష్ చేస్తే, అందులోని యాక్టీవ్ ఇంగ్రిడియంట్స్ క్లాత్స్‌కి అటాచ్ అవుతాయి. దుస్తులను మస్కిటో షీల్డ్‌లా మారుస్తాయి. దీని స్మెల్ చూస్తే దోమలు క్లాత్స్‌పై వాలవు. దీంతో దోమకాటు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు.

News December 22, 2025

పెట్టుబడులు రావడం KCRకు ఇష్టం లేదేమో: మంత్రి శ్రీధర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని KCR ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై KCR కామెంట్లను ఆయన ఖండించారు. ‘పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం KCRకు ఇష్టం లేనట్టుంది. BRS హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధికి దోహదపడేలా KCR సలహాలివ్వాలి. BRS నేతలు హైప్‌లో ఉన్నారు. మేం ప్రజలకు హోప్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 22, 2025

మే 12 నుంచి EAPCET

image

AP: వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ (CETs)-2026 షెడ్యూల్‌ను APSCHE విడుదల చేసింది. ఆయా సెట్ల పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
*EAPCET (Eng): 12, 13, 14, 15, 18
*EAPCET (agri, pharm): మే 19, 20
*ECET: ఏప్రిల్ 23
*ICET: ఏప్రిల్ 28
* LAW, EDCETs: మే 4
*PGECET: ఏప్రిల్ 29, 30, మే 2
*PGCET: మే 5, 8, 9, 10, 11