News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
Similar News
News February 21, 2026
వేడెక్కిన కశ్మీర్.. ALL TIME RECORD

ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీర్ ఇవాళ వేడెక్కెంది. ఏకంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతంలో FEBలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సాధారణం కంటే 11 డిగ్రీలు అధికంగా రికార్డయింది. అక్కడ 1940, 2016లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలను తాకింది. అలాగే ఈ నెలలో మంచుతో కప్పబడే గుల్మార్గ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు కాగా ఇవాళ 11.5 డిగ్రీలకు చేరింది. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News February 21, 2026
పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు.. సీఎం ప్రకటన

AP: ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘‘ఇవి వారానికోసారి గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికిరాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. వచ్చేనెల కల్లా అన్ని పంచాయతీల్లో 100% ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం. రాజమండ్రి, KNL, KDP, నెల్లూరులో రూ.1,254CRతో PPP విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తెస్తాం’’ అని తెలిపారు.
News February 21, 2026
VASTHU: ఏ అంతస్తులో ఎవరు ఉండాలి?

కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదాలను నివారించడంలో వాస్తుశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరించారు. అంతస్తులు గల భవనాలను సోదరులు ఏవిధంగా పంచుకోవాలో సూచించారు. ‘పై అంతస్తులో చిన్నవారు ఉండాలి. కింద పెద్దవారు నివసించాలి. సభ్యుల సంఖ్యను బట్టి ఈ క్రమాన్నే పాటించాలి. తద్వారా సోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది. మనస్పర్థలు రావు. కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


