News January 26, 2026

రాష్ట్రంలో 97 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

AP: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో <>97<<>> అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి PG(MD/MS/DNB/ DrNB/DM/MCh) ఉత్తీర్ణులు అర్హులు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, BC, EWSలకు రూ.1500. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/

Similar News

News February 19, 2026

ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్‌ స్పీచ్ రద్దు

image

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్‌ ‌గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌’లో బిల్‌ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

News February 19, 2026

అష్టలక్ష్మి: ధాన్యలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

ధాన్యలక్ష్మి దేవి ఆరాధనలో నీలవర్ణం వస్త్రం ఉంచి, పచ్చని పూలతో పూజ చేయాలి. ధాన్యలక్ష్మి వ్యవసాయానికి, ఆహారానికి అధిదేవత. పచ్చని పూలు ప్రకృతికి, జీవకళకు సంకేతం. మనింట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు లేకుండా ఉండాలని ఈ దేవిని ప్రార్థిస్తారు. నీలవర్ణం అనంత ఆకాశాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతిలో పూజించడం వల్ల రైతులు పంటలు బాగా పండుతాయని, సాధారణ ప్రజలు ఆకలి బాధలు లేకుండా సుభిక్షంగా ఉంటారని నమ్మకం.

News February 19, 2026

నువ్వుల సాగు.. కాండంకుళ్లు తెగులు నివారణ

image

కాండంకుళ్లు తెగులు ఆశించిన నువ్వుల పంట కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేర్లను చీల్చితే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోయి, చనిపోతాయి. అధిక తేమ పరిస్థితులు ఉన్నప్పుడు కాండంకుళ్లు తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.