News April 3, 2024
రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరు: MP అర్వింద్
రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించాలన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలి కానీ ఇలా ‘ మేము అమలు చేయం ’ అని అనడానికి ఉత్తమ్ ఎవరని నిలదీశారు. ఏ అధికారంతో ఈవ్యాఖ్యలు చేశారో చెప్పాలని MP ప్రశ్నించారు.
Similar News
News November 17, 2024
NZB: పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా అభ్యర్థులు
నిజామాబాద్‌లోని ఉమెన్స్ కళాశాల గ్రూప్ -3 పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు అనుమతించలేదు. సమయం పూర్తి కావడంతో కేంద్రం గేట్లు మూసేశారు. ముబారక్ నగర్ నుంచి ఒకరు, కామారెడ్డి నుంచి ఒకరు మొత్తం ఇద్దరు అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చి కేంద్రం గేట్లు మూసి ఉండటంతో నిరాశతో వెనుదిరిగారు.
News November 17, 2024
రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శనగర్ మలుపు వద్ద ఓ కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్ స్పాట్‌లో మృతిచెందగా, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు, శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు ముగ్గురు కలిసి కారులో మహారాష్ట్రలోని గానుగాపూర్ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
News November 17, 2024
KMR: జిల్లాలో గ్రూప్-3 రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు: SP
ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరిగే గ్రూప్-3 రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా SP సింధు శర్మ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.