News June 2, 2024

రాష్ట్రం ఏర్పాట్లు, పదేళ్లలో ఖమ్మం ఇలా..

image

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రారంభమై, పూర్తయిన తొలి సాగు నీటి ప్రాజెక్టుగా భక్త రామదాసు రికార్డు చరిత్ర లిఖించింది. భద్రాచలం ఐటీడీఏలో ఉన్న మండలాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సమస్య తీరింది. జిల్లాలో 161 పల్లె , 9 బస్తీ దవాఖానాలు, 210 PHCల ద్వారా వైద్యం అందుతోంది. పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతోంది.

Similar News

News September 30, 2024

ఖమ్మం: విద్యార్థుల చదువుకు ఆటంకం కలగొద్దు: కలెక్టర్

image

విద్యార్థులకు విద్య అభివృద్ధి, ఉద్యోగుల పదవీ విరమణ సన్మానం, కలెక్టరేట్లో మౌళిక వసతులపై అధికారులతో ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సమావేశం అయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అమలు అవుతున్న భోజనాన్ని పరిశీలించి తనకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అన్నారు. రిటైర్డ్ అవుతున్నా ఉద్యోగులను ఘనంగా సత్కరించుకుందామన్నారు.

News September 30, 2024

ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన ఎమ్మెల్యే

image

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శస్త్ర చికిత్స చేశారు. ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరంకి చెందిన కుంజ రత్తమ్మ(51) తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ చేసి గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు.

News September 30, 2024

పాలడుగు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

image

వైరా మండలం పాలడుగు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం చావా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ సోమవారం వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. హెడ్మాస్టర్ శ్రీనివాసరావుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.