News August 27, 2025

రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి పోటీలకు తాడిపత్రి విద్యార్థిని గౌసియా

image

తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థిని గౌసియా రాష్ట్రస్థాయి విజేతగా నిలిచింది. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో ఏపీ ఎయిడ్స్ నివారణ సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలలో ప్రతిభ కనబరిచి రూ.10 వేలు చెక్కును బహుమతిగా అందుకుంది. రాష్ట్రం తరఫున వచ్చే నెల 7న ముంబైలో జరిగే జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపల్ వెంకట నారాయణ తెలిపారు.

Similar News

News August 26, 2025

అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి:

image

అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మధు ప్రసాద్ ఏపీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. మధు మాట్లాడుతూ.. జిల్లాలో గురుకుల కళాశాల ఏర్పాటు, వంట వర్కర్ల జీతాలు, టెండర్ల విషయం, గురుకుల పాఠశాలలో సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జేఏసీ నాయకులు చిరంజీవి, వెంకి, నాగరాజు పాల్గొన్నారు.

News August 26, 2025

నేడు JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Adhoc-Contract-Base) పోస్టులకు ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లీష్ (1), ఫిజిక్స్ (1)కు నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు కళాశాలలోని ప్రధాన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నారు.

News August 26, 2025

అనంతపురం: పోలీసుల గ్రీవెన్స్‌కు 60 ఫిర్యాదులు

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 60 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు వినతులు పంపారు. గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.