News March 22, 2025

రాష్ట్రపతి అల్పాహార విందుకు ఎంపీ నగేష్

image

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కల్చరల్ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు శుక్రవారం ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేశ్ హాజరయ్యారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా& నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ ఇతర రాష్ట్రాల కీలక అంశాలపై చర్చించారు.

Similar News

News March 22, 2025

రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్, లారీ, కారు ఇలా ఒకదానినొకటి ఢీకొన్నాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న దేవేందర్‌గా ఒకరిని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2025

సోనాలలో హల్చల్ చేసిన గంగవ్వ

image

సోనాలలోని ఓ పాఠశాలలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవంలో మై విలేజ్ షో యూ ట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పాల్గొని సందడి చేశారు. గంగవ్వను చూడడానికి ప్రేక్షకులు దండెత్తారు. ప్రేక్షకులతో మై విలేజ్ షో యూట్యూబ్లో చేసిన అనుభవాలను పంచుకున్నారు. గంగవ్వతో సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి కనబరిచారు.

News March 22, 2025

బ్యాంక్, జిల్లా అధికారులతో ADB కలెక్టర్ సమావేశం

image

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన శుక్రవారం DCC/DLRS సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం ఈజీపీ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా శక్తి పథకం, తదితర వాటిపై బ్యాంకర్లు, అధికారులతో వారి శాఖల లక్ష్యంపై సమీక్షించారు. పెండింగ్ అప్లికేషన్స్ లబ్ధిదారులతో ఈ నెల 24న సమావేశం నిర్వహించి వివరాలు సేకరించాలని, బ్యాంకు వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు.

error: Content is protected !!