News March 3, 2025

రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేనేతకు ఆహ్వానం

image

ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ నాగరాజుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Vividtha Ka Amrit Mahotsav కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో ధర్మవరం పట్టు చీరల ప్రదర్శన కోసం నాగరాజు ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.

Similar News

News October 29, 2025

అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

image

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

News October 29, 2025

గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.

News October 28, 2025

‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

image

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.