News January 31, 2026
రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ KCRకు SIT నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని BRS పిలుపునిచ్చింది. కక్షసాధింపులకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలంది. ప్రతి మున్సిపాల్టీల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పేర్కొంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా KCRను వేధిస్తోందని దుయ్యబట్టింది.
Similar News
News February 18, 2026
ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంటే?

ఈశాన్యం లోపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘జ్ఞాన సముపార్జనలో ఆటంకాలు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలాంటి స్థలంలో ఉంటే సమాజానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లభించాల్సిన అవకాశాలు చేజారిపోతాయి. ఈశాన్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. నిపుణుల సలహాతో సరైన మార్పులు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 18, 2026
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ షురూ

AP: గురుకుల స్కూళ్లలో 5, 6, 7, 8 తరగతుల్లోని ఖాళీ సీట్లలో ప్రవేశానికి నిర్వహించే APRSCAT పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ప్రారంభమైంది. 51 విద్యాలయాల్లో 5వ తరగతి సీట్లు 4080, ఇతర తరగతుల సీట్లు 1844 ఉన్నాయి. CAT మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు గడువు మార్చి 31 కాగా APR 24న పరీక్ష ఉంటుంది. ‘https://aprs.apcfss.in’ వెబ్‌సైట్లో <
News February 18, 2026
కండోమ్ వాడకంతో సంతానలేమి? ప్రచారంలో నిజమెంత?

కండోమ్‌లను ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయనేది అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం స్త్రీ గర్భాశయంలోకి స్పెర్మ్ వెళ్లకుండా అడ్డుకుంటాయే తప్ప పురుషుల హార్మోన్లపై లేదా స్పెర్మ్ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపవు. పైగా సుఖవ్యాధుల (STIs) నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఇవి పరోక్షంగా ఫర్టిలిటీ హెల్త్‌ను కాపాడతాయి. సంతానోత్పత్తికి వీటివల్ల ముప్పు ఉండదని స్పష్టం చేశారు.


