News November 2, 2024
రాష్ట్రస్థాయికి తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ ఎంపిక

అనంతపురం జిల్లాస్థాయిలో జరిగిన సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన పోటీల్లో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 9న గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పీఈటీ చంద్ర తెలిపారు. విద్యార్థి అబ్బాస్‌ను హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Similar News
News February 23, 2026
సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.
News February 23, 2026
అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.