News December 7, 2025

రాష్ట్రస్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం

image

హైదరాబాద్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాలురు, బాలికల ఖో ఖో ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర జట్టు రంగారెడ్డి జిల్లాపై, బాలికల జట్టు నల్లగొండ జిల్లాపై గెలుపొందాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా డీఐఈఓలు విద్యార్థులను, కోచ్, మేనేజర్లు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావును అభినందించారు.

Similar News

News December 8, 2025

రెచ్చగొట్టేలా జైశంకర్‌ వ్యాఖ్యలు: పాకిస్థాన్

image

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.

News December 8, 2025

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 8, 2025

సిద్దిపేట: ఈ మండలంలో 6 సర్పంచులు ఏకగ్రీవం

image

సిద్దిపేట జిల్లాలోనే 38 గ్రామపంచాయతీలతో అతిపెద్ద మండలం అక్కన్నపేట. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలకు అక్కన్నపేట మండలం మూడో విడత ఎన్నికలకు ఎంపికైంది. మండలంలోని శ్రీరామ్ తండా, దుబ్బతండా, చౌడుతండా, దాసుతండా, గొల్లపల్లి, కుందనవానిపల్లి 6 గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండలంలో చాలా గ్రామాల్లో వార్డులు కూడా ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవ ఎన్నికల జరిగాయి.