News March 24, 2025
రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ADB అమ్మాయి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ అమ్మాయి సత్తాచాటింది. HYDలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఆదిలాబాద్‌కు చెందిన క్రీడాకారిణి జాదవ్ కుషవర్తి అండర్ 20 విభాగంలో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా జాదవ్ కుషవర్తితోపాటు కోచ్ సౌమ్య, మేనేజర్ అనిల్‌ను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్, పలువురు అభినందించారు
Similar News
News March 26, 2025
ADB: BC విద్యార్థులకు GOOD NEWS

BC విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ వాటాను డైరెక్ట్‌గా కళాశాలల ఖాతాలకు జమచేయనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు వారి బ్యాంకు అకౌంట్ డిటైల్స్, పాస్ బుక్ కాపీని బీసీ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ నెల 27లోపు ONLINEలో పొందుపరుచాలని, లెటర్ హెడ్ పైన అకౌంట్ డిటేల్స్‌తో పాటు స్టేట్ మెంట్ కాపీ జత చేయాలని సూచించారు.
News March 26, 2025
ADB: తల్వార్‌తో INSTAలో పోస్ట్.. వ్యక్తిపై కేసు

తల్వార్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బంగారిగూడకు చెందకన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం వైరలైందన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు ముఖ్యమైన కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు.
News March 26, 2025
ADB: KU సెమిస్టర్స్ ఫీజు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.