News March 11, 2025

రాష్ట్రస్థాయిలో సిద్దిపేట ప్రాజెక్టుల ప్రదర్శన

image

తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య కమిషనరేట్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జిజ్ఞాస పోటీల్లో సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, తెలుగు విభాగంలోని విద్యార్థులు ప్రదర్శించి కళాశాల విద్య కమిషనరేట్ సంయుక్త డైరెక్టర్ డా.రాజేంద్ర సింగ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వారిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.

Similar News

News October 29, 2025

WNP: రోగులకు మెరుగైన చికిత్స అందించాలి- కలెక్టర్

image

జిల్లాలో వర్ష ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగీ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్‌పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

News October 29, 2025

‘తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

image

మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఎక్కడ ఇబ్బందులు ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తలు వహించాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News October 29, 2025

జనగామ: పలు పాఠశాలలకు ఒక్క పూట సెలవు

image

జిల్లాలోని పాలకుర్తి మండలంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలు, కొడకండ్ల మండలంలోని ఎంపీపీఎస్ రామవరం, ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జనగామ మండలం చీటకోడూరు, ఎర్రకుంటతండాలో పాఠశాలలకు ఒక్కపూట సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు కలిగే నేపథ్యంలో ఆయా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.