News March 19, 2025
రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించిన ADB బిడ్డ

ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నాతోరి రవీందర్ ప్రభుత్వం విడుదల చేసిన HWO ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును సాధించి అందరి మన్ననలు పొందారు. రవీందర్ ఉట్నూర్ కీబీ ప్రాంగణంలోని ప్రభుత్వ పీఈటీసీ లైబ్రరీలో చదివి ఉద్యోగం సాధించారు. రవీందర్‌ను పీఈటీసీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, తోటి విద్యార్థులు అభినందించారు..
Similar News
News March 19, 2025
రాష్ట్ర బడ్జెట్‌పై ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ADB జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉట్నూర్ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా, జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్, స్పిన్నింగ్ వద్ద ఫ్లైఓవర్ పనులకు, చనాక-కొరాట ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద అభివృద్ధి, పర్యాటక రంగానికి, పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
News March 19, 2025
ADB: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు: DSP

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒకరు గంజాయి పండించేవాడు, ఇద్దరు గంజాయి తాగే వారున్నారని తెలిపారు. వీరి నుంచి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News March 19, 2025
ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కును రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.