News January 19, 2026
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు మూడు పతకాలు

ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-12 బాలుర 400 మీటర్ల పరుగులో పి. గోవింద్ వెండి పతకం సాధించగా, అండర్-10 విభాగంలో జి. జితేష్ (60 మీటర్లు), అండర్-8 విభాగంలో మరో క్రీడాకారుడు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. జిల్లాకు మూడు పతకాలు రావడంపై అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు పరమేశ్వర్, వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 14, 2026
సిద్ధు జొన్నలగడ్డతో Freedom oil కొత్త టీవీ ప్రకటన

Freedom రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ సరికొత్త ప్రచార చిత్రాన్ని ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డతో విడుదల చేసింది. ‘ఫ్రీడమ్‌తో ఇంటింటా, నెం.1 వంట’ అనే నినాదంతో రూపొందిన ఈ ప్రకటన తెలుగు కుటుంబాల వంటగదిలోని ఆప్యాయతను, సందడిని ఆవిష్కరిస్తోంది. వంట చేయడం అనేది ఒక వేడుక అని చాటిచెప్పే ఈ వీడియోలో సిద్ధు తనదైన శైలిలో ఉత్సాహంగా కనిపించారు. నాణ్యమైన రుచికి Freedom బ్రాండ్ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

GNT: అమరావతిలో ‘మినీ ఢిల్లీ’

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరనున్నాయి. దీంతో రాజధాని ‘మినీ ఢిల్లీ’ని తలపించనుంది. సెంట్రల్ సెక్రటేరియట్ కోసం కేంద్రం రూ. 2,534 కోట్లు కేటాయించింది. రూ. 1,299 కోట్లతో 5.53 ఎకరాల్లో సచివాలయం కడతారు. రూ. 1,235 కోట్లతో 17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగులకు ఇళ్లు నిర్మిస్తారు. అలాగే హడ్కో ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ కూడా రానుంది.