News September 2, 2024

రాష్ట్రస్థాయి టాపర్‌గా దుబ్బాక విద్యార్థి

image

ఇంటర్‌ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్‌ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్‌గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్‌ నిలిచాడు. ఒకేషన్‌ కోర్సులో సుకుమార్‌ ఈటీ (ఎలక్ట్రీషియన్‌ టెక్నీషియన్‌) చేశాడు. ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 994 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి టాపర్‌గా నిలిచాడు. ఈనెల 4న హైదరాబాద్‌లో ఇంటర్‌ బోర్డు రాష్ట్ర స్థాయి టాపర్లకు నగదు పారితోషికం, అవార్డు అందజేయనున్నారు.

Similar News

News March 9, 2026

శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యక పూజలు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం శ్రీతునికి నల్ల పోచమ్మకు అర్చకుడు శివప్ప ప్రత్యేక పూజలు చేశారు. నేడు సోమవారం రెండో రోజు బండ్లు తిరుగుట, అలాగే అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించి, ధూప దీపాలతో అష్టోత్తర నామాలతో పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

News March 9, 2026

MDK: చట్టపరంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం: ఏఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను ఆయనకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న అదనపు ఎస్పీ, అందిన ఫిర్యాదులపై క్షుణ్నంగా పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 9, 2026

మెదక్: ఇంటర్‌ పరీక్షలు.. 96.80 శాతం హాజరు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్-I, ఎకనామిక్స్-I పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6,401 మందికి గాను 6,198 మంది, ఒకేషనల్ విభాగంలో 621 మందికి గాను 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొమ్మిదో రోజు మొత్తం 96.80 శాతం హాజరు నమోదైంది. DIEO మాధవి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.