News March 22, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు ఖమ్మం బిడ్డ సిరి

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2025 రాష్ట్రస్థాయి పోటీలకు జేవియర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దాసరి సిరి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.గోపి తెలిపారు. కళాశాలతో పాటు మండల, జిల్లా స్థాయుల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులు దాసరి సిరికి అభినందనలు తెలిపారు.
Similar News
News March 22, 2025
ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఇలా..

ఖమ్మం జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొణిజర్ల(M) పెద్దగోపతి, ఖమ్మం ఖానాపురంలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. అటు సత్తుపల్లిలో 38.7, కల్లూరులో 38.6, వైరాలో 38.5, ముదిగొండలో 38.5, పెనుబల్లి 38.4, కారేపల్లిలో 37.9, ఏన్కూరులో 37.3, రఘునాథపాలెంలో 37.2, బోనకల్‌లో 36.7, కుసుమంచిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.
News March 22, 2025
ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.
News March 22, 2025
6గ్యారంటీలకు రూ.56 వేల కోట్లు: Dy.CM

BRS పాలనలో రాష్ట్ర GST వృద్ధి రేటు 8.54 శాతంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది 12.3 శాతానికి పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరు గ్యారంటీల కోసం మాత్రమే రూ.56 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, బడ్జెట్‌ను సవరించి, నిజమైన లెక్కలనే ప్రజలకు వెల్లడించామన్నారు.