News September 26, 2025

రాష్ట్రస్థాయి పోటీల్లో కర్నూలు జిల్లాకు రెండో స్థానం

image

ఈనెల 25 నుంచి 26 వరకు పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల ఆట్యాపాట్యా పోటీలలో ఫైనల్స్‌లో కర్నూలు జిల్లా జట్టు పల్నాడు జట్టుపై 20-16 తేడాతో ఓడి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జిల్లా సంఘం సీఈవో నాగరత్నమయ్య తెలిపారు. లీగ్ దశలో మంచి ప్రతిభ చూపి ఫైనల్‌కు చేరుకొని పోరాడి ఓడిందన్నారు. టీమ్ శిక్షకుడిగా చరణ్ వ్యవహరించారు.

Similar News

News September 27, 2025

గల్లంతయిన విద్యార్థి కుటుంబానికి కలెక్టర్ భరోసా

image

ఈనెల 25న కర్నూలు కేసీ కెనాల్‌లో ఈతకు వెళ్లి అశోక్ మృతిచెందగా, ప్రశాంత్ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిరి మరణించిన విద్యార్థి అశోక్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థి ప్రశాంత్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News September 26, 2025

పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డా.సిరి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

News September 26, 2025

మెగా ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి టీజీ

image

రాష్ట్రంలో కేంద్ర భాగస్వామ్యంతో మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామ‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ శాస‌నమండ‌లిలో తెలిపారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పారిశ్రామిక నోడ్‌లు, బల్క్ డ్రగ్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.