News January 14, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు వాసులు విజయం

సంక్రాతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామ పల్లెకారులు విజయం సాధించారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా గోదావరి జిల్లాల్లో పడవల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న రామాపురం మత్స్యకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 7, 2026
గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.
News February 6, 2026
PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
రోగులతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News February 6, 2026
ఉద్దండరాయునిపాలెం: రేపు క్వాంటం వ్యాలీకి సీఎం భూమిపూజ

రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో శనివారం క్వాంటం వ్యాలీ నిర్మాణానికి CM చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు కార్యక్రమ ప్రదేశాన్ని పర్యవేక్షించి, బందోబస్తుపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


