News October 10, 2025
రాష్ట్రస్థాయి బాక్సింగ్‌కు నిర్మల్ క్రీడాకారులు

అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి SGF పోటీలకు నిర్మల్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. నికిత (భైంసా), కీర్తన (నిర్మల్), అభినయ (నర్సాపూర్), శ్రావణి(ఖానాపూర్), పల్లవి ( బాసర), కవిత(జామ్), సంజన(నిర్మల్) ఎంపికైనట్లు వెల్లడించారు. వారిని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ చందుల స్వామి, SGF సెక్రటరీ రవీందర్ గౌడ్ అభినందించారు.
Similar News
News October 10, 2025
కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్‌లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
News October 10, 2025
HYD: అక్టోబర్ 12న పోలియో చుక్కలు

నిండు ప్రాణానికి- రెండు చుక్కలు నినాదంతో అక్టోబర్ 12న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు DMHO డా.లలితాదేవి తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. HYD, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్నారు. RR జిల్లా పట్టణ ప్రాంతంలో 1,99,967 మందికి, గ్రామీణ ప్రాంతంలో 2,20,944 మొత్తం 4,20,911 చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
News October 10, 2025
బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్

2024-25 రబీ సీజన్ బియ్యాన్ని రా మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి అందించాలని జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం మిల్లర్లతో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కేటాయింపులు మిల్లర్ల సూచనల ప్రకారం ఉంటాయని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్‌లను తక్షణం సమర్పించాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు రావద్దన్నారు.