News September 17, 2024
రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం

ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.
Similar News
News March 8, 2025
పోసానిని కస్టడీకి ఇవ్వండి: ఆదోని పోలీసులు

కర్నూలు జిల్లా జైలులో ఉన్న నటుడు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ <<15653795>>ఆదోని<<>> పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ దీనిపై విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు.
News March 7, 2025
నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరపాలక సంస్థ ఎస్ఈని ఆదేశించారు. శుక్రవారం కర్నూలు నగర శివార్లలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు వెల్లడించారు.
News March 7, 2025
విద్యార్థులకు పక్కాగా భోజనాన్ని అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని కలెక్టర్ పి.రంజిత్ భాష ఆదేశించారు. శుక్రవారం కర్నూల్ నగరంలోని ఎస్ఎపీ క్యాంప్‌లోని నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు సులభంగా గణితం అర్థమయ్యేందుకు టిప్స్ సైతం అందించారు. అనంతరం విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు.