News January 18, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేత వైజాగ్ జట్టు

image

శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వైజాగ్ జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సున్నిపెంట యూత్ ఆధ్వర్యంలో సెంట్రల్ లొకాలిటీ పాఠశాలలో 4 రోజులుగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రన్నర్‌గా గంగావతి టీమ్, 3వ స్థానంలో కర్నూలు, 4వ స్థానంలో అనంతపురం టీంలు నిలిచాయి. ఆ జట్లకు నిర్వాహకులు నగదుతో పాటు కప్పులను అందజేశారు.

Similar News

News January 18, 2025

మంత్రి ఫరూక్‌పై సీఎం అసంతృప్తి!

image

మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.

News January 18, 2025

కర్నూలు, నంద్యాల జిల్లాలకు కొత్త డీఎస్పీలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలను కేటాయిస్తూ డీజీపి సీహెచ్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ డీఎస్పీలకు పోస్టింగ్‌లు కేటాయించారు. అందులో భాగంగా ఆదోని డీఎస్పీగా మర్రిపాటి హేమలత, ఆళ్లగడ్డ డీఎస్పీగా కొలికిపూడి ప్రమోద్‌ నియమితులయ్యారు. త్వరలో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News January 18, 2025

చిరంజీవి బీజేపీలో చేరట్లేదు: టీజీ వెంకటేశ్

image

మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీతో మంచి అనుబంధం ఉంది. బీజేపీ పెద్దలతో చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. అంత మాత్రాన పార్టీలో చేరుతారని ఎలా చెబుతారు. కొందరు పనిగట్టుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు