News August 25, 2025
రాష్ట్రస్థాయి విజేతగా ఉమ్మడి వరంగల్ జట్టు

యువత క్రీడల్లో రాణించాలని బాల్ బ్యాడ్మింటన్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో పురుషులు, మహిళల బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఉమ్మడి వరంగల్ విజేతగా, రంగారెడ్డి రన్నరప్‌గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విజేతగా, వరంగల్ రన్నరప్‌గా నిలిచి బహుమతులు అందుకున్నాయి.
Similar News
News August 25, 2025
ALERT: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. <
News August 25, 2025
ఎకో ఫ్రెండ్లీ బయో అర్బన్ సిటీగా HYD: కమిషనర్

GHMC అద్భుతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ బయో అర్బన్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ, రూఫ్ టాప్ సోలార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నూతన ప్రాజెక్టులు, 4 చోట్ల C&D వేస్ట్ ప్లాంట్లు, 25 లక్షల మొక్కలు, 300 పార్కులు, మెట్రో, 300 పైగా ఎలక్ట్రిసిటీ బస్సులు నడిపిస్తునామన్నారు.
News August 25, 2025
అల్వాల్: Way2News Impact.. మరమ్మతులు

అల్వాల్ పరిధిలోని హెల్తీ బ్రెయిన్ ఆస్పత్రి నుంచి గోపాల్ నగర్ వెళ్లే మార్గంలో రోడ్డు గుంతల మయంగా మారి, అధ్వానస్థితికి చేరిందని ఆదివారం Way2News ఓ కథనాన్ని రాసింది. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. అనేక చోట్ల గుంతలను సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చి వేసినట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.